ఐపీఎల్‌ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు

వీక్షణలో ఐపీఎల్‌-17 కొత్త రికార్డు నెలకొల్పింది.

Published : 29 Mar 2024 02:39 IST

ముంబయి: వీక్షణలో ఐపీఎల్‌-17 కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నీ తొలిరోజు చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ను డిస్నీ స్టార్‌లో 16.8 కోట్ల మంది వీక్షకులు చూశారు. ఏ సీజన్లోనైనా తొలిరోజు మ్యాచ్‌ను ఇంతమంది తిలకించడం ఇదే మొదటిసారి. అంతేకాక రికార్డు స్థాయిలో 1276 కోట్ల నిమిషాల వీక్షణ సమయం నమోదైంది. ఒకే సమయంలో అత్యధికంగా 6.1 కోట్ల మంది మ్యాచ్‌ను తిలకించారు. జియో సినిమా డిజిటల్‌ వేదికలో తొలిరోజు 11.3 కోట్ల మంది మ్యాచ్‌ను చూశారు. 660 కోట్ల వీక్షణ సమయం నమోదైంది. 2023 సీజన్‌ తొలిరోజుతో పోలిస్తే ఇది 51 శాతం అధికం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని