కోల్‌కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్‌

గాయంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరమైన ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ స్థానాన్ని మరో అఫ్గాన్‌ స్పిన్నర్‌ అల్లా గజన్‌ఫర్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భర్తీ చేసింది.

Published : 29 Mar 2024 02:40 IST

దిల్లీ: గాయంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరమైన ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ స్థానాన్ని మరో అఫ్గాన్‌ స్పిన్నర్‌ అల్లా గజన్‌ఫర్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భర్తీ చేసింది. 16 ఏళ్ల గజన్‌ఫర్‌ ఇప్పటికే రెండు వన్డేల్లో అఫ్గానిస్థాన్‌కు ఆడాడు. దేశవాళీ క్రికెట్లో మూడు టీ20లు, ఆరు లిస్ట్‌- ఎ మ్యాచ్‌లు ఆడిన అనుభవమూ ఉంది. కనీస ధర రూ.20 లక్షలకు అతను.. కేకేఆర్‌తో చేరనున్నాడు. మరోవైపు శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ తీసుకుంది. అతని కనీస ధర రూ.50 లక్షలు. అంతర్జాతీయ క్రికెట్లో 27 టీ20లు, 44 వన్డేలు, 50 టెస్టులాడిన మహరాజ్‌ 237 వికెట్లు పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని