సూర్య ఇంకొన్ని రోజులు!

సూర్యకుమార్‌ యాదవ్‌ ఐపీఎల్‌-17లో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం.

Published : 29 Mar 2024 02:41 IST

దిల్లీ: సూర్యకుమార్‌ యాదవ్‌ ఐపీఎల్‌-17లో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. హెర్నియాకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఈ ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు ఇప్పటికే ఆ జట్టు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకునే ప్రక్రియలో ఉన్నాడు. ‘‘సూర్య వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే అతడు ముంబయి ఇండియన్స్‌ తరఫున బరిలో దిగుతాడు. అయితే కొన్ని మ్యాచ్‌లకు మాత్రం దూరం కావొచ్చు. సూర్య టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండేలా చేయడం తొలి లక్ష్యం. పూర్తిగా నయం కాకుండానే ఐపీఎల్‌ ఆడనిచ్చే సాహసం చేయట్లేదు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్‌-17లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ముంబయి ఇండియన్స్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని