బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు.

Published : 29 Mar 2024 02:41 IST

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో 12 ఓవర్ల లోపు బుమ్రాతో ఒక్క ఓవర్‌ మాత్రమే వేయించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఐపీఎల్‌ విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్న స్మిత్‌ చెప్పాడు. ‘‘ముంబయి జట్టు చేసిన బౌలింగ్‌ మార్పుల మతలబేంటో నాకు అర్థం కాలేదు. బుమ్రా అయిదో ఓవర్‌ వేశాడు. 5 పరుగులే ఇచ్చాడు. కానీ 13వ ఓవర్‌ వరకు అతను మళ్లీ కనిపించలేదు. కానీ బుమ్రా తిరిగొచ్చేసరికే స్కోరు 173కు చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. పరుగులు ధారాళంగా వస్తున్నపుడు జట్టులోని ఉత్తమ బౌలర్‌ను తీసుకొచ్చి వికెట్లు పడేలా చూడాలి. కానీ బుమ్రాను మాత్రం 13వ ఓవర్‌కు కానీ తిరిగి తీసుకురాలేదు. ముంబయి కొన్ని తప్పులు చేసింది. అందులో ప్రధానమైంది ఇదే’’ అని స్మిత్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని