నితిన్‌ అయిదోసారి..

భారత అంపైర్‌ నితిన్‌ మేనన్‌ అయిదోసారి ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇం

Published : 29 Mar 2024 02:43 IST

దుబాయ్‌: భారత అంపైర్‌ నితిన్‌ మేనన్‌ అయిదోసారి ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇండోర్‌కు చెందిన నితిన్‌ 2020లో తొలిసారి ప్యానల్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి భారత్‌ తరఫున కొనసాగుతున్న ఏకైక అంపైర్‌గా నిలిచాడు. ఎస్‌.వెంకట్రాఘవన్‌, ఎస్‌.రవి తర్వాత ఎలైట్‌ ప్యానల్‌లో చోటు దక్కించుకున్న ఘనత నితిన్‌దే. ఇప్పటిదాకా అతడు 23 టెస్టులు, 58 వన్డేలు, 41 టీ20లకు బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది యాషెస్‌ సిరీస్‌కూ అంపైరింగ్‌ చేశాడు. మరోవైపు షర్‌ఫుద్దౌలా షాహీద్‌ (బంగ్లాదేశ్‌) కూడా ఎలైట్‌ ప్యానల్‌లోకి వచ్చాడు. బంగ్లా నుంచి ప్యానల్‌లో స్థానం సంపాదించిన తొలి అంపైర్‌ అతడే. ఇటీవల రిటైర్‌ అయిన మారిస్‌ ఎరాస్మస్‌ స్థానంలో అతడికి ఈ అవకాశం వచ్చింది. ఐసీసీ ఎలైట్‌ మ్యాచ్‌ రిఫరీ ప్యానల్‌ నుంచి క్రిస్‌ బ్రాడ్‌ చోటు కోల్పోయాడు. 2003 నుంచి రిఫరీగా ఉన్న బ్రాడ్‌ 123 టెస్టులు, 361 వన్డేలు, 135 టీ20లకు బాధ్యతలు చేపట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని