అమెరికా జట్టులో కివీస్‌ ఆల్‌రౌండర్‌

కోరీ అండర్సన్‌ గుర్తున్నాడా? ఒకప్పుడు 36 బంతుల్లోనే సెంచరీ చేసి వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతక రికార్డును నెలకొల్పిన న్యూజిలాండ్‌ ఆటగాడు.

Published : 30 Mar 2024 02:25 IST

న్యూయార్క్‌: కోరీ అండర్సన్‌ గుర్తున్నాడా? ఒకప్పుడు 36 బంతుల్లోనే సెంచరీ చేసి వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతక రికార్డును నెలకొల్పిన న్యూజిలాండ్‌ ఆటగాడు. ఈ ఆల్‌రౌండర్‌ ఇప్పుడు అమెరికాకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. కొన్నేళ్లుగా అమెరికాలో నివాసం ఉంటూ ఆ జట్టుకు ఆడే అర్హత సాధించాడు కోరీ. త్వరలో కెనడాతో జరిగే టీ20 సిరీస్‌లో అతను ఆడబోతున్నాడు. తర్వాత అతను టీ20 ప్రపంచకప్‌లోనూ బరిలో దిగే అవకాశముంది. అండర్సన్‌ చివరగా 2018 నవంబరు 2న న్యూజిలాండ్‌ తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని