కోహ్లి, గంభీర్‌ నవ్వుల్‌ నవ్వుల్‌..

ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లి, గౌతమ్‌ గంభీర్‌ మధ్య వైరం తెలిసిందే. నిరుడు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా గంభీర్‌ ఉన్న సమయంలో.. ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగిన విషయం విదితమే.

Updated : 30 Mar 2024 08:31 IST

బెంగళూరు: ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లి, గౌతమ్‌ గంభీర్‌ మధ్య వైరం తెలిసిందే. నిరుడు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా గంభీర్‌ ఉన్న సమయంలో.. ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగిన విషయం విదితమే. ఇప్పుడు కోల్‌కతా మెంటార్‌గా గంభీర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో కోల్‌కతా, ఆర్సీబీ మ్యాచ్‌ అనగానే అందరి దృష్టి కోహ్లి, గంభీర్‌లపైనే కేంద్రీకృతమైంది. కానీ ఆర్సీబీ ఇన్నింగ్స్‌ వ్యూహ విరామ సమయంలో ఈ ఇద్దరూ నవ్వుతూ పలకరించుకోవడం విశేషం. మైదానంలోకి వచ్చిన గంభీర్‌.. కోహ్లి దగ్గరకు వెళ్లి కరచాలనం చేశాడు. కోహ్లి కూడా నవ్వుతూ స్పందిస్తూ గంభీర్‌ను హత్తుకున్నాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. సంబందిత  వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మ్యాచ్‌లో అత్యుత్తమ సందర్భం ఇదేనంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భానికి ఫెయిర్‌ ప్లే అవార్డు దక్కాలంటూ వ్యాఖ్యాత రవిశాస్త్రి పేర్కొనగా.. కేవలం ఫెయిర్‌ ప్లే అవార్డే కాదు వీళ్లకు ఆస్కార్‌ ఇవ్వాలని గావస్కర్‌ చమత్కరించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని