ఇదే నా అత్యుత్తమ చివరి ఓవర్‌

ఇప్పటిదాకా తాను వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లలో గురువారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్‌ మీద వేసిందే ఉత్తమమైందని రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ అవేష్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 30 Mar 2024 02:27 IST

జైపుర్‌: ఇప్పటిదాకా తాను వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లలో గురువారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్‌ మీద వేసిందే ఉత్తమమైందని రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ అవేష్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీసీకి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌ జోరుమీదుండడంతో రాజస్థాన్‌కు కష్టమే అనిపించింది. కానీ కట్టుదిట్టంగా బంతులేసిన అవేష్‌.. చివరి ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చి జట్టును గెలిపించాడు. ఈ ప్రదర్శన గురించి అవేష్‌ మాట్లాడుతూ.. ‘‘నేను చివరి ఓవర్‌ ఇలా వేయడం ఇదే తొలిసారి కాదు. అయితే ప్రణాళికల్ని సరిగ్గా అమలు చేయడంలో ఇదే నా అత్యుత్తమ చివరి ఓవర్‌. నేను అనుకున్న చోట బంతులు పడ్డాయి’’ అని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని