భారీ స్కోరు దిశగా లంక

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా శ్రీలంకకు రెండో మ్యాచ్‌లో మంచి ఆరంభం దక్కింది. తొలి టెస్టులో బంగ్లాను చిత్తుచేసిన లంక.. శనివారం మొదలైన రెండో టెస్టులో భారీ స్కోరుకు బాటలు వేసుకుంది.

Published : 31 Mar 2024 02:14 IST

బంగ్లాతో రెండో టెస్టు

ఛటోగ్రామ్‌: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా శ్రీలంకకు రెండో మ్యాచ్‌లో మంచి ఆరంభం దక్కింది. తొలి టెస్టులో బంగ్లాను చిత్తుచేసిన లంక.. శనివారం మొదలైన రెండో టెస్టులో భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 314/4తో నిలిచింది. కుశాల్‌ మెండిస్‌ (93; 150 బంతుల్లో 11×4, 1×6), దిముత్‌ కరుణరత్నె (86; 129 బంతుల్లో 8×4, 1×6), నిషాన్‌ మదుష్క (57) రాణించారు. దినేశ్‌ చండిమాల్‌ (34 బ్యాటింగ్‌), కెప్టెన్‌ ధనంజయ (15 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. బంగ్లా టెస్టు అరంగేట్ర పేసర్‌ హసన్‌ (2/64) ఆకట్టుకున్నాడు. గాయం కారణంగా నిరుడు వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఆటకు దూరమైన ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ పునరాగమనంలో ఓ వికెట్‌ తీశాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్‌ క్యాచ్‌ వదిలేయడంతో బ్యాటింగ్‌ కొనసాగించిన మదుష్క.. కరుణరత్నెతో కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కుశాల్‌ జతగా కరుణరత్నె సాగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను   ఈ జోడీ సమర్థంగా ఎదుర్కొంది. కానీ శతకానికి 7 పరుగుల దూరంలో కుశాల్‌ వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత ధనంజయతో కలిసి దినేశ్‌ జట్టు స్కోరును 300 దాటించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని