సాత్విక్‌ జోడీ సైనాను దాటి!

భారత బ్యాడ్మింటన్‌ స్టార్లు జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి గొప్ప ఘనత సాధించారు. దిగ్గజ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ను అధిగమిస్తూ భారత్‌ తరఫున ఎక్కువ వారాలు నంబర్‌వన్‌గా జోడీగా నిలిచారు.

Published : 31 Mar 2024 02:15 IST

దిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్లు జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి గొప్ప ఘనత సాధించారు. దిగ్గజ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ను అధిగమిస్తూ భారత్‌ తరఫున ఎక్కువ వారాలు నంబర్‌వన్‌గా జోడీగా నిలిచారు. 2015లో నంబర్‌వన్‌ ర్యాంకు సాధించిన సైనా 9 వారాలు (ఆగస్టు 18-అక్టోబర్‌ 20) ఆ స్థానంలో కొనసాగింది. 2024 జనవరి 23న టాప్‌ ర్యాంకు సొంతం చేసుకున్న సాత్విక్‌ ద్వయం ఇప్పటికి పది వారాలు పూర్తి చేసుకుంది. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన తర్వాత 2023 అక్టోబర్‌లో తొలిసారి ఈ ర్యాంకు సాధించిన సాత్విక్‌ జంట.. ఆ తర్వాత కోల్పోయింది. ఆపై మలేసియా ఓపెన్‌, ఇండియా ఓపెన్లో సత్తా చాటి మళ్లీ ఈ ఏడాది ఆరంభంలో అగ్రస్థానానికి చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు