టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు ఎంపిక అప్పుడే..

జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ మొదలవడానికి అయిదు వారాల ముందే సెలక్టర్లు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఏప్రిల్‌ చివరి వారానికి ముహూర్తం నిర్ణయించినట్లు తెలిసింది.

Updated : 31 Mar 2024 07:15 IST

దిల్లీ: జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ మొదలవడానికి అయిదు వారాల ముందే సెలక్టర్లు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఏప్రిల్‌ చివరి వారానికి ముహూర్తం నిర్ణయించినట్లు తెలిసింది. పొట్టి కప్పు కోసం జట్టు ప్రకటించడానికి గడువు మే 1. ముందు ఆ రోజుకల్లా జట్టును ప్రకటించేస్తే, మే 25 వరకు మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశముంటుంది. ‘‘ఏప్రిల్‌ చివరి వారంలో జట్టు ఎంపిక ఉంటుంది. అప్పటికి ఐపీఎల్‌ సగం అయిపోయి ఉంటుంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, ఫామ్‌ మీద సెలక్టర్లు ఒక అంచనాకు వచ్చి ఉంటారు. మే 19న లీగ్‌ దశ అవ్వగానే కొందరు క్రికెటర్లు న్యూయార్క్‌కు బయల్దేరతారు. ప్లేఆఫ్స్‌కు వెళ్లిన జట్లకు ఆడే క్రికెటర్లు తర్వాతి దశలో అక్కడికి చేరుకుంటారు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని