కలయా.. నిజమా

ఆధునాతన క్రికెట్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలతో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకున్నా అన్న విషయం గుర్తొస్తే.. నిజమేనా అని గిల్లి చూసుకుంటానని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ పేర్కొన్నాడు.

Published : 31 Mar 2024 02:17 IST

ముంబయి: ఆధునాతన క్రికెట్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలతో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకున్నా అన్న విషయం గుర్తొస్తే.. నిజమేనా అని గిల్లి చూసుకుంటానని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ పేర్కొన్నాడు. ‘‘కోహ్లి, రోహిత్‌ దిగ్గజ ఆటగాళ్లు. వీళ్లతో ఆడడం ఒక్కోసారి నిజమేనా అనిపిస్తుంది. గిల్లి చూసుకుంటూ ఉంటా. ఇదెంతో అదృష్టం. కోహ్లి-రోహిత్‌ జట్టు విజయం కోసం వందశాతం కష్టపడతారు’’ అని గ్రీన్‌ చెప్పాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున అరంగేట్రం చేసిన గ్రీన్‌.. ఈ ఏడాది ఆర్సీబీకి ఆడుతున్నాడు. గ్రీన్‌ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని నిరుడు అతడే వెల్లడించాడు. కొన్నిసార్లు తన సమస్య మానసికంగా ఇబ్బందిపెడుతుందని అన్నాడు. ‘‘నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇలా అవుతోంది? మరెవరికీ ఇలా జరగలేదు కదా..? ఇలాంటి ప్రశ్నలు నన్ను వేధిస్తాయి. నా వల్ల జట్టు ఇబ్బందిపడుతోందన్న భావన కలుగుతుంది. మ్యాచ్‌ సందర్భంలోనూ ఇలాంటి ఆలోచనలు నాపై ఒత్తిడి పెంచుతాయి. ఏదేమైనా జట్టును  మెరుగైన స్థితిలో ఉంచేందుకే ప్రయత్నిస్తుంటా’’ అని గ్రీన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని