పారిస్‌ బెర్తుపై చాను గురి

భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తుపై గురిపెట్టింది. సోమవారం ప్రారంభంకానున్న ఐడబ్ల్యూఎఫ్‌ ప్రపంచకప్‌లో పాల్గొని ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని భావిస్తోంది.

Published : 01 Apr 2024 01:45 IST

ఫుకెట్‌ (థాయ్‌లాండ్‌): భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తుపై గురిపెట్టింది. సోమవారం ప్రారంభంకానున్న ఐడబ్ల్యూఎఫ్‌ ప్రపంచకప్‌లో పాల్గొని ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని భావిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన చాను ఆరు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటోంది. పారిస్‌ క్రీడల అర్హతకు ఇదే చివరి టోర్నీ. ప్రస్తుతం ఒలింపిక్స్‌ అర్హత ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం (49 కేజీలు)లో ఉన్న చానుకు పారిస్‌ బెర్తు దాదాపుగా ఖాయమైనట్లే. ప్రపంచకప్‌లో బరిలో దిగడం ద్వారా చాను అర్హత లాంఛనం పూర్తవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని