అంతా పసుపుమయం

అయిదేళ్ల తర్వాత విశాఖలో తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌. ఇక్కడి వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని రెండు మ్యాచ్‌ల కోసం దిల్లీ క్యాపిటల్స్‌ సొంత వేదికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.

Updated : 01 Apr 2024 04:03 IST

అయిదేళ్ల తర్వాత విశాఖలో తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌. ఇక్కడి వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని రెండు మ్యాచ్‌ల కోసం దిల్లీ క్యాపిటల్స్‌ సొంత వేదికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. కానీ పేరుకే దిల్లీ సొంత మైదానం. సీఎస్కేతో పోరులో సందడంతా చెన్నై అభిమానులదే. స్టాండ్స్‌ మొత్తం పసుపు మయంగా మారిపోయింది. సాధారణంగానే సీఎస్కే మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా ఆ జట్టు అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. ధోనీకి ఇదే చివరి సీజన్‌ అనే ఊహాగానాల మధ్య అతణ్ని మైదానంలో చూసేందుకు అభిమానులు ఈసారి మరింతగా తరలివచ్చారు. ఇక చెన్నైకు దగ్గర్లోనే ఉన్న విశాఖలో మ్యాచ్‌ అనే సరికి అభిమాన సంద్రం పోటెత్తింది. నగరంలోనూ ఎక్కడ చూసినా చెన్నై అభిమానుల సందడే కనిపించింది. దీంతో ఇది తమకు సొంత మైదానంలో మ్యాచ్‌లా మారిపోయిందని సీఎస్కే కెప్టెన్‌ రుతురాజ్‌ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ సీఎస్కే కొత్త రికార్డు సృష్టించింది. 1.50 కోట్ల (15 మిలియన్‌) మంది అనుచరులను పొందిన తొలి ఐపీఎల్‌ జట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఆర్సీబీ (1.35 కోట్లు), ముంబయి ఇండియన్స్‌ (1.32 కోట్లు) ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని