ఫుట్‌బాల్‌ సమాఖ్య సభ్యుడి అరెస్టు

ఇద్దరు క్రీడాకారిణులపై భౌతిక దాడికి పాల్పడినందుకు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు దీపక్‌శర్మను గోవా పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

Published : 01 Apr 2024 01:47 IST

పనాజి: ఇద్దరు క్రీడాకారిణులపై భౌతిక దాడికి పాల్పడినందుకు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు దీపక్‌శర్మను గోవా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ సంఘానికి దీపక్‌ కార్యదర్శి కూడా. ఇండియన్‌ వుమెన్స్‌ ఫుట్‌బాల్‌ (ఐడబ్ల్యూఎల్‌) రెండో డివిజన్‌ లీగ్‌లో పాల్గొనేందుకు ఖాడ్‌ ఎఫ్‌సీ (హిమాచల్‌ ప్రదేశ్‌) ఫుట్‌బాలర్లు గోవా వచ్చారు. మార్చి 28న రాత్రి ఖాడ్‌ ఎఫ్‌సీ యజమాని దీపక్‌ అమ్మాయిల గదిలోకి చొరబడి క్రీడాకారిణులపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడన్నది ఆరోపణ. ‘‘అధికారంగా ఫిర్యాదు అందడంతో దీపక్‌ను పిలిచి విచారించాం. మహిళలపై భౌతిక దాడికి పాల్పడడంతో సంబంధిత సెక్షన్ల కింద దీపక్‌ను అరెస్టు చేశాం’’ అని డీఎస్పీ సందేశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని