బాబర్‌ చేతికి మళ్లీ పగ్గాలు

పాకిస్థాన్‌ వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ తిరిగి నియమితుడయ్యాడు. టీ20 ప్రపంచకప్‌కు రెండు నెలల ముందు బాబర్‌ చేతికి మళ్లీ పగ్గాలు అప్పగిస్తూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నిర్ణయం తీసుకుంది.

Published : 01 Apr 2024 01:48 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ తిరిగి నియమితుడయ్యాడు. టీ20 ప్రపంచకప్‌కు రెండు నెలల ముందు బాబర్‌ చేతికి మళ్లీ పగ్గాలు అప్పగిస్తూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నిర్ణయం తీసుకుంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ వైఫల్యం అనంతరం బాబర్‌ను తప్పించి పేసర్‌ షహీన్‌ షా అఫ్రిదికి పగ్గాలు అప్పగించింది పీసీబీ. కానీ అతడి నాయకత్వంలో జట్టు వరుస ఓటములు చవిచూసింది. చివరగా జనవరిలో జరిగిన టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 1-4తో పాక్‌ చిత్తయింది. దీంతో బాబర్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమిస్తూ పీసీబీ సెలెక్షన్‌ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని