శ్రీలంక 531

బ్యాటర్లు సమష్టిగా సత్తాచాటడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 314/4తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక..

Published : 01 Apr 2024 01:49 IST

ఛట్టోగ్రామ్‌: బ్యాటర్లు సమష్టిగా సత్తాచాటడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 314/4తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక.. దినేశ్‌ చండిమాల్‌ (59; 104 బంతుల్లో 5×4, 2×6), ధనంజయ డిసిల్వా (70; 111 బంతుల్లో 6×4, 2×6), కమిందు మెండిస్‌ (92 నాటౌట్‌; 167 బంతుల్లో 7×4, 2×6) అర్ధసెంచరీలు సాధించడంతో 531 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ మొదలుపెట్టిన బంగ్లా.. రెండో రోజు ఆట చివరికితొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 55 పరుగులు చేసింది. లంక స్కోరును అందుకోవాలంటే బంగ్లా మరో 476 పరుగులు సాధించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని