వారెవా.. ఏమా క్యాచ్‌!

అర్ధశతకం చేసి వార్నర్‌ జోరుమీదున్నాడు. అతణ్ని పెవిలియన్‌ చేర్చాలంటే చెన్నై ఏదైనా ప్రత్యేకంగా చేయాల్సిన పరిస్థితి. అప్పుడే పతిరన అద్భుత క్యాచ్‌తో వార్నర్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

Updated : 01 Apr 2024 04:05 IST

అర్ధశతకం చేసి వార్నర్‌ జోరుమీదున్నాడు. అతణ్ని పెవిలియన్‌ చేర్చాలంటే చెన్నై ఏదైనా ప్రత్యేకంగా చేయాల్సిన పరిస్థితి. అప్పుడే పతిరన అద్భుత క్యాచ్‌తో వార్నర్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. పదో ఓవర్లో ముస్తాఫిజుర్‌ స్లో డెలివరీని వార్నర్‌ రివర్స్‌ స్కూప్‌ ఆడాలని ప్రయత్నించాడు. అతడి షాట్‌కు బంతి బౌండరీకి వెళ్లిపోతున్నట్లే కనిపించింది. కానీ సూపర్‌ మ్యాన్‌లా మెరుపు వేగంతో కుడి వైపునకు గాల్లో ఎగిరి ఒంటిచేత్తో అతను బంతిని అందుకున్నాడు. దీంతో నమ్మశక్యం కానట్లు చూస్తూ వార్నర్‌ నిష్క్రమించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని