మనవాళ్లు గెలవడం కష్టమే..

క్యాండిడేట్స్‌ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు టైటిల్‌ గెలిచే అవకాశాలు చాలా స్వల్పమని, ముందు వాళ్లు నిలదొక్కుకోవాలని అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ అన్నాడు.

Published : 02 Apr 2024 02:17 IST

దిల్లీ: క్యాండిడేట్స్‌ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు టైటిల్‌ గెలిచే అవకాశాలు చాలా స్వల్పమని, ముందు వాళ్లు నిలదొక్కుకోవాలని అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ అన్నాడు. వచ్చే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం ఛాలెంజర్‌ను నిర్ణయించే క్యాండిడేట్స్‌ టోర్నీ బుధవారం ఆరంభం కానుంది. భారత్‌ నుంచి ప్రజ్ఞానంద, గుకేశ్‌, విదిత్‌ గుజరాతి పోటీపడుతున్నారు. ‘‘భారత ఆటగాళ్ల అవకాశాలు స్వల్పం. వాళ్లు మెరుగ్గా ఆడుతూ ముందుకు సాగితే చాలు. ఆలస్యంగా అవకాశాలు వస్తే అందిపుచ్చుకోవచ్చు. వాళ్లు ముందు టోర్నీలో నిలదొక్కుకోవాలి. మంచి గేమ్‌లు ఆడడానికి ప్రయత్నించాలి’’ అని ఆనంద్‌ అన్నాడు. ఫాబియానో కరువానా, నకముర క్యాండిడేట్స్‌ టోర్నీలో స్పష్టమైన ఫేవరెట్లని అతడు అభిప్రాయపడ్డాడు. ఎనిమిది మంది ఆటగాళ్లు పోటీపడే ఈ టోర్నీలో 14 గేములు ఉంటాయి. అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం డింగ్‌ లిరెన్‌ (చైనా)ను ఢీకొంటాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని