నగాల్‌ @ 95

భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. సోమవారం ప్రకటించిన ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో నగాల్‌ 95వ స్థానంలో నిలిచాడు.

Published : 02 Apr 2024 02:19 IST

లండన్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. సోమవారం ప్రకటించిన ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో నగాల్‌ 95వ స్థానంలో నిలిచాడు. చెన్నై ఓపెన్‌, ఓ ఏటీపీ ఛాలెంజర్‌ టోర్నీ నెగ్గిన నగాల్‌.. ఫిబ్రవరిలో 97వ ర్యాంకు సాధించాడు. ఆ తర్వాత కూడా నిలకడగా రాణించడంతో ఇప్పుడు మరో రెండు స్థానాలు మెరుగయ్యాడు. చెన్నై ఓపెన్‌లో విజయం తర్వాత అతను మరో రెండు ఛాలెంజర్‌, ఓ ఏటీపీ 500, రెండు ఏటీపీ 1000 మాస్టర్స్‌ టోర్నీల్లో ఆడాడు. బెంగళూరు ఛాలెంజర్‌ టోర్నీలో సెమీస్‌ వరకూ వెళ్లాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రధాన డ్రాకు అర్హత సాధించిన నగాల్‌.. ఇందులో సీడెడ్‌ ఆటగాణ్ని (కజకిస్థాన్‌కు చెందిన బబ్లిక్‌) ఓడించిన తొలి భారత క్రీడాకారుడిగా నిలిచాడు. కానీ రెండో రౌండ్‌ దాటలేకపోయాడు. మొరాకోలో జరిగే ఏటీపీ 250 టోర్నీ కోసం నగాల్‌ సిద్ధమవుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని