అసిత విజృంభణ.. లంకకు ఆధిక్యం

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను శ్రీలంక   క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా దూసుకెళ్తోంది. పేసర్‌ అసిత ఫెర్నాండో (4/34) విజృంభించడంతో రెండో టెస్టులో శ్రీలంక భారీ ఆధిక్యం సంపాదించింది.

Published : 02 Apr 2024 02:19 IST

ఛట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను శ్రీలంక   క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా దూసుకెళ్తోంది. పేసర్‌ అసిత ఫెర్నాండో (4/34) విజృంభించడంతో రెండో టెస్టులో శ్రీలంక భారీ ఆధిక్యం సంపాదించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 55/1తో సోమవారం ఉదయం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లా.. 178 పరుగులకే కుప్పకూలింది. అసిత, విశ్వ ఫెర్నాండో (2/38), లహిరు కుమార (2/19), ప్రబాత్‌ జయసూర్య (2/65) సత్తాచాటి శ్రీలంకకు 353 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందించారు. బంగ్లా జట్టులో జాకిర్‌ హసన్‌ (54; 104 బంతుల్లో 8×4) ఒక్కడే చెప్పుకోదగ్గర స్కోరు సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో 6 వికెట్లకు 102 పరుగులు రాబట్టింది. ప్రస్తుతం శ్రీలంక ఖాతాలో 455 పరుగులు ఉన్నాయి. ఏంజెలో మాథ్యూస్‌ (39 బ్యాటింగ్‌; 50 బంతుల్లో 3×4) క్రీజులో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని