వేగం కాదు ముఖ్యం..

ప్రపంచంలోనే వేగవంతమైన బౌలర్‌గా నిలవాలని అనుకోవట్లేదని.. ఉత్తమ బౌలర్‌గా ఎదగాలని కోరుకుంటున్నానని యువ పేస్‌ సంచలనం మయాంక్‌ యాదవ్‌ అన్నాడు.

Published : 02 Apr 2024 02:20 IST

దిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన బౌలర్‌గా నిలవాలని అనుకోవట్లేదని.. ఉత్తమ బౌలర్‌గా ఎదగాలని కోరుకుంటున్నానని యువ పేస్‌ సంచలనం మయాంక్‌ యాదవ్‌ అన్నాడు. ఐపీఎల్‌-17లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్‌ పేసర్‌ ఓ బంతిని 155.8 కి.మీ వేగంతో విసిరి అందరి దృష్టిలో పడ్డాడు. ‘‘పంజాబ్‌ కింగ్స్‌పై ప్రదర్శన ఎంతో సంతృప్తినిచ్చింది. తొలి అవకాశం దక్కించుకున్నాక అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో బరిలో దిగా. మూడేళ్ల నుంచి ఎల్‌ఎస్‌జీతో ఉన్నా. తొలి ఏడాది అవకాశం దక్కలేదు.. రెండో ఏడాది గాయంతో దూరమయ్యా. కానీ ఎట్టకేలకు ఐపీఎల్‌ అరంగేట్రం చేసే ఛాన్స్‌ వచ్చింది. ఎక్కువ ప్రయోగాలు చేయకుండా సహజసిద్ధంగా బంతులు వేయమని కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఇచ్చిన సలహా బాగా పని చేసింది. నా బౌలింగ్‌లో సానుకూలాంశం వేగం. అలా అని వేగవంతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకోవాలని లేదు.. ఉత్తమ బౌలర్‌గా నిలవాలనుకుంటున్నా. వీలైనంత తక్కువ పరుగులు ఇచ్చి.. వికెట్లు తీయాలి’’ అని మయాంక్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని