అందులో మహిని మించినోళ్లు లేరు

ఆటపై అవగాహన విషయంలో ధోనీని మించిన వాళ్లు ఎక్కువగా లేరని, దిల్లీపై అతని బ్యాటింగ్‌ అద్భుతమని సీఎస్కే కోచ్‌ ఫ్లెమింగ్‌ పేర్కొన్నాడు. ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఛేదనలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 16 బంతుల్లోనే 37 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే.

Published : 02 Apr 2024 02:25 IST

విశాఖపట్నం: ఆటపై అవగాహన విషయంలో ధోనీని మించిన వాళ్లు ఎక్కువగా లేరని, దిల్లీపై అతని బ్యాటింగ్‌ అద్భుతమని సీఎస్కే కోచ్‌ ఫ్లెమింగ్‌ పేర్కొన్నాడు. ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఛేదనలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 16 బంతుల్లోనే 37 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్‌ గురించే ఫ్ల్లెమింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇదెంతో (ధోని బ్యాటింగ్‌) అందంగా ఉంది.. అవునా? కాదా? సీజన్‌కు ముందు అతను గొప్పగా సన్నద్ధమయ్యాడు. తీవ్రగాయం నుంచి కోలుకుని వచ్చాడు. అతని బ్యాటింగ్‌ అద్భుతంగా ఉంది. కఠినమైన రోజున ఆ బ్యాటింగ్‌ మాకు సానుకూలతను అందించింది. 20 పరుగుల తేడాతో ఓడటం రన్‌రేట్‌ పరంగా ఎంతో ముఖ్యమైంది. అది ధోనీకి తెలుసు. అందుకే అతనాడిన తీరు అమోఘం’’ అని ఫ్లెమింగ్‌ తెలిపాడు.

ధోని పైన ఆడాలంటే..: మ్యాచ్‌ మలుపు తిరిగేలా ఉంటే ధోని ముందే బ్యాటింగ్‌ రావొచ్చని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ధోని బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందొస్తాడని అనుకోవడం లేదు. అతనే అదే స్థానంలో ఆడే అవకాశముంది. ఒకవేళ మ్యాచ్‌ మలుపు తిరిగే అవకాశం  ఉంటే ధోని బ్యాటింగ్‌ ఆర్డర్లో పైన ఆడే ఆస్కారముంది. బంతిని చక్కగా బాదుతున్నంత మాత్రాన అతను 5, 6 స్థానాల్లో ఆడాలని కాదు. అతను ఆఖర్లోనే అదరగొడతాడు. నేను చూసిన వాళ్లలో అతనే ఉత్తమ ఫినిషర్‌. కాబట్టి జట్టు అతణ్ని అదే పాత్రలో ఉపయోగించుకుంటుంది’’ అని క్లార్క్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని