ఛాంపియన్స్‌ లీగ్‌ పునరుద్ధరణపై చర్చలు

ఛాంపియన్స్‌ లీగ్‌ (సీఎల్‌టీ20) పునరుద్ధరణపై భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డులు దృష్టిసారించాయి. 2014లో చివరిసారి ఛాంపియన్స్‌ లీగ్‌ నిర్వహించగా.. పదేళ్ల తర్వాత లీగ్‌ పునరుద్ధరణ కోసం మూడు బోర్డులు చర్చలు ప్రారభించాయి.

Published : 03 Apr 2024 02:45 IST

ముంబయి: ఛాంపియన్స్‌ లీగ్‌ (సీఎల్‌టీ20) పునరుద్ధరణపై భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డులు దృష్టిసారించాయి. 2014లో చివరిసారి ఛాంపియన్స్‌ లీగ్‌ నిర్వహించగా.. పదేళ్ల తర్వాత లీగ్‌ పునరుద్ధరణ కోసం మూడు బోర్డులు చర్చలు ప్రారభించాయి. ‘‘ఛాంపియన్స్‌ లీగ్‌ అప్పటి కాలం కంటే ముందుంది. ఆ సమయంలో టీ20 క్రికెట్‌ అంతగా పరిపక్వత చెందలేదు. ఇప్పుడు పరిణతి సాధించింది. సీఎల్‌టీ20 పునరుద్ధ గురించి ఆసీస్‌, ఇంగ్లాండ్‌, భారత్‌ బోర్డుల మధ్య చర్చలు చురుగ్గా సాగుతున్నాయని నాకు తెలుసు.  లీగ్‌ నిర్వహణకు సరైన సమయాన్ని అన్వేషిస్తున్నాయి’’ అని క్రికెట్‌ విక్టోరియా సీఈఓ నిక్‌ కమిన్స్‌ తెలిపాడు. 2014లో బెంగళూరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజేతగా నిలిచింది. ఆ సీజన్‌లో భారత్‌ నుంచి మూడు.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తరఫున రెండేసి జట్లు.. పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ నుంచి ఒక్కో జట్టు  బరిలో దిగాయి. 2009-10 నుంచి 2014-15 వరకు ఆరు  సీజన్‌ల పాటు సీఎల్‌టీ20 జరిగింది. భారత్‌లో నాలుగు,  దక్షిణాఫ్రికాలో రెండు సీజన్లు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని