లంక గెలుపు ఆలస్యం!

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌స్వీప్‌ చేయడం లాంఛనమే కావచ్చు. కానీ.. రెండో టెస్టులో ఆ జట్టు విజయం ఆలస్యమైంది. ప్రత్యర్థికి 511 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి నాలుగో రోజే మ్యాచ్‌ను ముగించాలని చూసిన లంకకు నిరీక్షణ తప్పలేదు.

Published : 03 Apr 2024 02:48 IST

రెండో టెస్టులో లక్ష్యం 511.. బంగ్లా 268/7

ఛట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌స్వీప్‌ చేయడం లాంఛనమే కావచ్చు. కానీ.. రెండో టెస్టులో ఆ జట్టు విజయం ఆలస్యమైంది. ప్రత్యర్థికి 511 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి నాలుగో రోజే మ్యాచ్‌ను ముగించాలని చూసిన లంకకు నిరీక్షణ తప్పలేదు. రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతున్న బంగ్లా.. ఆట చివరికి 268/7తో నిలిచింది. 3 వికెట్లే చేతిలో ఉన్న బంగ్లా ఇంకా 243 పరుగులు చేయాలి. అద్భుతాలు జరిగితే తప్ప ఆ జట్టుకు ఓటమి తప్పకపోవచ్చు. తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే కుప్పకూలిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్‌లో పోరాట పటిమ చూపింది. ఆ జట్టులో ప్రతి బ్యాటర్‌ రెండంకెల స్కోరు సాధించాడు. మొమినుల్‌ (50), షకిబ్‌ (38), లిటన్‌ దాస్‌ (38), మెహదీ మిరాజ్‌ (44 బ్యాటింగ్‌) పట్టుదల ప్రదర్శించారు. లంక బౌలర్లలో కుమార (2/41), కమిందు మెండిస్‌ (2/22), ప్రబాత్‌ (2/79) రాణించారు. మిరాజ్‌కు తోడుగా తైజుల్‌ (10 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగుల భారీ స్కోరు చేసిన లంక.. రెండో ఇన్నింగ్స్‌ను 157/7 వద్ద డిక్లేర్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని