ప్రజ్ఞానంద మీదే ఆశలు

వచ్చే ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ ఛాలెంజర్‌ను నిర్ణయించే క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ బుధవారం ఆరంభం కానుంది. భారత్‌ నుంచి పోటీపడుతున్న వాళ్లలో యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి.

Published : 03 Apr 2024 02:49 IST

నేటి నుంచే క్యాండిడేట్స్‌ టోర్నీ

టొరంటో: వచ్చే ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ ఛాలెంజర్‌ను నిర్ణయించే క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ బుధవారం ఆరంభం కానుంది. భారత్‌ నుంచి పోటీపడుతున్న వాళ్లలో యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. గుకేశ్‌, విదిత్‌ గుజరాతి టోర్నీలో ఆడనున్న మరో ఇద్దరు భారతీయులు. ఉన్నవాళ్లలో ప్రజ్ఞానంద మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ.. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లకు టైటిల్‌ అవకాశాలు స్వల్పమేనని చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ సహా పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టాప్‌ సీడ్‌ ఫాబియానో కరౌనా (అమెరికా) ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. 14 రౌండ్ల క్యాండిడేట్స్‌ టోర్నీలో 8 మంది పోటీపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని