బీసీసీఐ ముందే ప్రకటించి ఉంటే..

టీ20 ప్రపంచకప్‌నకు రోహిత్‌శర్మను కెప్టెన్‌గా బీసీసీఐ ముందే ప్రకటించి ఉండుంటే.. అతను ముంబయి ఇండియన్స్‌ సారథ్యం కోల్పోయేవాడు కాదని భారత మాజీ ఆటగాడు   నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధు అన్నాడు.

Published : 03 Apr 2024 02:49 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌నకు రోహిత్‌శర్మను కెప్టెన్‌గా బీసీసీఐ ముందే ప్రకటించి ఉండుంటే.. అతను ముంబయి ఇండియన్స్‌ సారథ్యం కోల్పోయేవాడు కాదని భారత మాజీ ఆటగాడు   నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధు అన్నాడు. పొట్టి కప్పులో భారత్‌కు రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఈ ఏడాది ఫిబ్రవరిలో బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. దానికి రెండు నెలల ముందు రోహిత్‌ స్థానంలో ముంబయి సారథిగా హార్దిక్‌ పాండ్య నియమితుడయ్యాడు. ‘‘నిరుడు అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌కు రోహిత్‌ను నాయకుడిగా ప్రకటించి ఉండుంటే హార్దిక్‌కు ముంబయి పగ్గాలు అప్పజెప్పేది కాదు. ఇది ఫ్రాంచైజీ గౌరవానికి సంబంధించిన విషయం. ఇక్కడ అసలు సమస్య నిర్ణయం తీసుకున్న సమయమే. భారత హీరో, టీమ్‌ఇండియా సారథి తమ జట్టు కెప్టెన్‌గా ఉండకపోవడాన్ని ముంబయి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్‌ చేసిన తప్పేంటని ఆలోచిస్తున్నారు. కానీ దానికి హార్దిక్‌ ఏం చేయాలి? తొలి రెండు మ్యాచ్‌ల్లో ముంబయి గెలిచుంటే ఇంత రభస జరిగేది కాదు’’ అని సిద్ధు పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని