2019 ప్రపంచకప్‌ ఫైనల్లో పెద్ద తప్పు చేశా

2019 ప్రపంచకప్‌ ఫైనల్లో ఘోరమైన తప్పిదం చేసినట్లు ఇటీవలే రిటైరైన ఐసీసీ ఎలీట్‌ ప్యానెల్‌ మాజీ అంపైర్‌ మరియస్‌ ఎరాస్మస్‌ అన్నాడు. లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది.

Updated : 03 Apr 2024 08:35 IST

లండన్‌: 2019 ప్రపంచకప్‌ ఫైనల్లో ఘోరమైన తప్పిదం చేసినట్లు ఇటీవలే రిటైరైన ఐసీసీ ఎలీట్‌ ప్యానెల్‌ మాజీ అంపైర్‌ మరియస్‌ ఎరాస్మస్‌ అన్నాడు. లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. వివాదాస్పద రీతిలో ముగిసిన ఫైనల్లో సూపర్‌ ఓవర్‌ తర్వాత కూడా స్కోర్లు సమమవడంతో బౌండరీ కౌంట్‌బ్యాక్‌ నిబంధన ప్రకారం ఇంగ్లాండ్‌ మొట్టమొదటి సారిగా ప్రపంచకప్‌ అందుకుంది. 50వ ఓవర్లో ఇంగ్లాండ్‌ 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన సమయంలో అంపైర్లు ఎరాస్మస్‌, కుమార ధర్మసేన ఓవర్‌ త్రో రూపంలో ఇంగ్లాండ్‌కు ఆరు పరుగులిచ్చారు. నిజానికి బ్యాటర్లు రెండో పరుగు పూర్తి చేయలేదు కాబట్టి ఓవర్‌ త్రో కింద అయిదు పరుగులే ఇవ్వాల్సింది. అదే జరిగితే మ్యాచ్‌ టై కాకపోయేది. న్యూజిలాండ్‌ గెలిచేది. ‘‘మర్నాడు ఉదయం హోటల్‌ గదుల నుంచి కుమార, నేను ఒకే సమయంలో బయటకి వచ్చాం. ‘మనం పెద్ద తప్పు చేశామని మీరు గమనించారా?’ అని కుమార అన్నాడు. అప్పుడే నాకు తెలిసింది. అయితే మైదానంలో ఉన్న ఆ క్షణంలో ఒకరికొకరం ‘ఆరు’ ‘ఆరు’ అని చెప్పుకొన్నాం. కానీ వాళ్లు రెండో పరుగు పూర్తి చేయలేదని గమనించలేకపోయాం’’ అని ఎరాస్మస్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని