పోరాడుతూనే ఉంటాం

తాము ఆశలు వదులుకోమని, ఐపీఎల్‌లో పోరాడుతూనే ఉంటామని ముంబయి ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. ముంబయి వరుసగా మూడో పరాజయం చవిచూసిన నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

Published : 03 Apr 2024 02:51 IST

ముంబయి: తాము ఆశలు వదులుకోమని, ఐపీఎల్‌లో పోరాడుతూనే ఉంటామని ముంబయి ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. ముంబయి వరుసగా మూడో పరాజయం చవిచూసిన నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ జట్టు గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. మేమెప్పుడూ ఆశలు వదులుకోం. మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని హార్దిక్‌ చెప్పాడు. రోహిత్‌ శర్మ స్థానంలో ముంబయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హార్దిక్‌ అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముంబయి తొలి మూడు మ్యాచ్‌ల సందర్భంగా వాళ్లు అతణ్ని గేలి చేశారు కూడా. ఇంకా పాయింట్ల ఖాతా తెరవని ముంబయి.. పట్టికలో అట్టడుగున ఉంది. ఆ జట్టు తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని