టీ20 ప్రపంచకప్‌ నుంచి స్టోక్స్‌ ఔట్‌

ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ రాబోయే టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగాడు. ఆల్‌రౌండర్‌గా కొనసాగేందుకు ఇది తాను చేస్తున్న త్యాగమని చెప్పాడు. తన నిర్ణయాన్ని అతడు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డుకు తెలిపాడు. ‘‘అన్ని రకాల ఫార్మాట్లో ఆల్‌రౌండర్‌గా నా పాత్రను పోషించడం కోసం తిరిగి బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించేందుకు చాలా శ్రమిస్తున్నా.

Published : 03 Apr 2024 02:54 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ రాబోయే టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగాడు. ఆల్‌రౌండర్‌గా కొనసాగేందుకు ఇది తాను చేస్తున్న త్యాగమని చెప్పాడు. తన నిర్ణయాన్ని అతడు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డుకు తెలిపాడు. ‘‘అన్ని రకాల ఫార్మాట్లో ఆల్‌రౌండర్‌గా నా పాత్రను పోషించడం కోసం తిరిగి బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించేందుకు చాలా శ్రమిస్తున్నా. ఐపీఎల్‌, ప్రపంచకప్‌లకు దూరం కావడం.. ఆల్‌రౌండర్‌గా ఉండేందుకు నేను చేస్తున్న త్యాగం అనుకోవచ్చు’’ అని ఈసీబీ విడుదల చేసిన ప్రకటనలో స్టోక్స్‌ పేర్కొన్నాడు. స్టోక్స్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌ జట్టు ఇటీవల భారత పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-4తో కోల్పోయింది. తన బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సరిగా లేదని ఆ పర్యటనలో అర్థమైందని స్టోక్స్‌ చెప్పాడు. 2022లో వన్డేల నుంచి రిటైరైన 32 ఏళ్ల స్టోక్స్‌.. నిరుడు వన్డే ప్రపంచకప్‌ కోసం తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తిరిగి క్రికెట్‌ ఆడడం మొదలుపెట్టినా.. బౌలింగ్‌కు మాత్రం దూరంగా ఉంటున్నాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌లో అయిదు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని