స్వదేశానికి ముస్తాఫిజుర్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ స్వదేశానికి వెళ్లాడు. అమెరికా- వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు వీసా ప్రక్రియను పూర్తిచేసేందుకు అతను బంగ్లాదేశ్‌కు చేరుకున్నాడు.

Published : 04 Apr 2024 02:38 IST

దిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ స్వదేశానికి వెళ్లాడు. అమెరికా- వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు వీసా ప్రక్రియను పూర్తిచేసేందుకు అతను బంగ్లాదేశ్‌కు చేరుకున్నాడు. పాస్‌పోర్ట్‌ తిరిగి ముస్తాఫిజుర్‌ చేతికి వచ్చిన తర్వాతే అతను భారత్‌కు వస్తాడని చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్‌ తెలిపాడు. దీంతో శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌కు ముస్తాఫిజుర్‌ దూరమయ్యాడు.

ఐపీఎల్‌కు మావి దూరం: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ శివమ్‌ మావి ఐపీఎల్‌కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయం నుంచి కోలుకోకపోవడంతో సీజన్‌ మొత్తానికి మావి దూరమైనట్లు లఖ్‌నవూ బుధవారం ప్రకటించింది. నిరుడు ఆగస్టులో చివరి మ్యాచ్‌ ఆడిన మావి గాయం కారణంగా దేశవాళీ సీజన్‌కు దూరంగా ఉన్నాడు. అయితే సీజన్‌కు ముందు లఖ్‌నవూ శిబిరంలో చేరిన మావి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. నిరుడు గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని మావిని ఆటగాళ్ల వేలం పాటలో రూ.6.4 కోట్లకు లఖ్‌నవూ కొనుక్కుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని