బెంగళూరు టైటిల్‌ కరవుకు కారణం అదే

భారీ మొత్తాలు తీసుకుంటున్న అంతర్జాతీయ క్రికెటర్లు ఒత్తిడికి లోనవుతుండటమే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టైటిల్‌ కరవుకు కారణమని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు.

Published : 04 Apr 2024 02:40 IST

దిల్లీ: భారీ మొత్తాలు తీసుకుంటున్న అంతర్జాతీయ క్రికెటర్లు ఒత్తిడికి లోనవుతుండటమే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టైటిల్‌ కరవుకు కారణమని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. జట్టు భారాన్నంతా జూనియర్‌ ఆటగాళ్లపై మోపుతున్నారని అతనన్నాడు. ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున రాయుడు ఐపీఎల్‌ టైటిళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ‘‘బెంగళూరు బౌలర్లు ఎప్పుడూ ఎక్కువ పరుగులిస్తారు. బ్యాటింగ్‌ విభాగం తక్కువ ప్రదర్శన చేస్తుంది. ఒత్తిడి సమయాల్లో బ్యాటింగ్‌ చేస్తున్న వాళ్లంతా ఎవరు? భారత యువ బ్యాటర్లు మాత్రమే. ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అంతర్జాతీయ స్టార్లు ఎక్కడ? పదహారేళ్లుగా బెంగళూరుది ఇదే కథ. ఒత్తిడి ఉన్నప్పుడు పెద్ద ఆటగాళ్లు ఎప్పుడూ నిలబడరు. యువ ఆటగాళ్లంతా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కింద ఉంటే.. స్టార్‌ బ్యాటర్లంతా టాప్‌ ఆర్డర్‌లో ఆడతారు. కఠిన సమయాల్లో సీనియర్లుండరు. ఐపీఎల్‌లో బెంగళూరు విజేతగా నిలవకపోవడానికి కారణం ఇదే’’ అని రాయుడు అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని