శ్రీలంక క్లీన్‌స్వీప్‌

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌స్వీప్‌ చేసింది. బుధవారం ముగిసిన మ్యాచ్‌లో శ్రీలంక 192 పరుగుల ఆధిక్యంతో బంగ్లాను చిత్తుచేసి లాంఛనం పూర్తిచేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

Published : 04 Apr 2024 02:41 IST

చట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌స్వీప్‌ చేసింది. బుధవారం ముగిసిన మ్యాచ్‌లో శ్రీలంక 192 పరుగుల ఆధిక్యంతో బంగ్లాను చిత్తుచేసి లాంఛనం పూర్తిచేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 268/7తో అయిదో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లా 85 ఓవర్లలో 318 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి రోజు ఆటలో 18 ఓవర్లాడిన బంగ్లా మరో 50 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. మెహదీ హసన్‌ మిరాజ్‌ (81) ఒంటరి పోరాటం చేశాడు. పేసర్‌ లహిరు కుమార (4/50) విజృంభించి బంగ్లా తోక తెంచాడు. ఈ పర్యటనలో శ్రీలంక 2-1తో టీ20 సిరీస్‌ను గెలుచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని