3 నెలల్లో మూడు గాయాలతో పోరాడా: సూర్యకుమార్‌ యాదవ్‌

మూడు నెలల్లో తాను 3 గాయాలతో పోరాడినట్లు ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. మరింత మెరుగయ్యేందుకు చాలా కష్టడినట్లు తెలిపాడు.

Updated : 11 Apr 2024 08:19 IST

ముంబయి: మూడు నెలల్లో తాను 3 గాయాలతో పోరాడినట్లు ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. మరింత మెరుగయ్యేందుకు చాలా కష్టడినట్లు తెలిపాడు. ‘‘స్పోర్ట్స్‌ హెర్నియా, చీలమండ, కుడి మోకాలి గాయాలయ్యాయి. ఒక్కో గాయం నుంచి బయటపడుతూ ఇక్కడికి చేరుకున్నా. మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. గత మూడున్నర నెలల కాలాన్ని విశ్లేషించడం చాలా కష్టం. మొదటి రెండు, మూడు వారాలు చేసిందే చేయడంతో మొహం మొత్తింది. మెరుగవ్వాలంటే ఇదంతా తప్పదని తర్వాత గ్రహించా. నా భార్య, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లోని వాళ్లతో మాట్లాడగా.. మైదానంలో అడుగుపెట్టినప్పుడు నేను భిన్నంగా ఉంటానని చెప్పారు. సరైన సమయానికి తినడం.. మంచి ఆహారాన్ని తీసుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టా. నా జీవితంలో ఎప్పుడూ పుస్తకం చదవలేదు. ఆ పని కూడా ప్రారంభించా. ఉదయాన్నే నిద్రలేచి కసరత్తులు చేశా. నేను వేగంగా కోలుకునేందుకు అన్నీ దోహదపడ్డాయి’’ అని సూర్య వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని