బుమ్రా.. కెనడాలో స్థిరపడాలనుకుని!

జస్‌ప్రీత్‌ బుమ్రా.. భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ పేసర్లలో ఒకడు. ఎన్నో ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో భారత్‌కు కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

Updated : 12 Apr 2024 13:48 IST

ముంబయి: జస్‌ప్రీత్‌ బుమ్రా.. భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ పేసర్లలో ఒకడు. ఎన్నో ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో భారత్‌కు కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లోనూ ముంబయి తరఫున అతడికి గొప్ప రికార్డుంది. అయితే ఒకప్పుడు బుమ్రా.. కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడాలని, ఆ దేశ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నాడట. తన భార్య, స్పోర్ట్స్‌ ప్రెజెంటర్‌ అయిన సంజన గణేశన్‌తో కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అతనీ విషయం వెల్లడించాడు. ‘‘నువ్వు ఒకప్పుడు కెనడాకు వెళ్లి కొత్త జీవితం మొదలుపెట్టాలనుకున్నావు కదా’’ అని సంజన అడగ్గా.. ‘‘అవును. అప్పట్లో ఆ చర్చ జరిగింది. దేశంలో ప్రతి కుర్రాడూ క్రికెట్‌ ఆడాలనుకుంటాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కనే కుర్రాళ్లు ప్రతి వీధిలోనూ పాతికమంది ఉంటారు. అందుకే ప్రత్యామ్నాయ ప్రణాళికలుండాలి. మా మేనమామ కెనడాలో ఉన్నారు. నేను చదువు పూర్తి చేశాక అక్కడికి వెళ్లి స్థిరపడాలనుకున్నా. కానీ అక్కడంతా భిన్నమైన సంస్కృతి ఉంటుందన్న కారణంతో మా అమ్మ నన్ను వెళ్లనివ్వలేదు. తర్వాత నాకు అంతా కలిసి వచ్చింది కాబట్టి నేను అదృష్టవంతుడిని. లేదంటే నేను కెనడాకు వెళ్లి ఆ దేశ క్రికెట్‌ జట్టుకు ఆడేందుకు ప్రయత్నించేవాడిని’’ అని బుమ్రా తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు