నగాల్‌కు రూ.10 లక్షలు: చాముండి

భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌కు ఐపీఎల్‌ పాలక మండలి సభ్యుడు చాముండేశ్వరినాథ్‌ ఆర్థిక సహాయం ప్రకటించాడు. శిక్షణ తీసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గతంలో ప్రకటించిన నగాల్‌కు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు శుక్రవారం చాముండి తెలిపాడు.

Published : 13 Apr 2024 02:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌కు ఐపీఎల్‌ పాలక మండలి సభ్యుడు చాముండేశ్వరినాథ్‌ ఆర్థిక సహాయం ప్రకటించాడు. శిక్షణ తీసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గతంలో ప్రకటించిన నగాల్‌కు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు శుక్రవారం చాముండి తెలిపాడు. ఎఫ్‌ఎన్‌సీసీ టెన్నిస్‌ టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా భారత స్టార్‌ సానియా మీర్జా, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చీఫ్‌ సి.వి.ఆనంద్‌ సమక్షంలో చాముండి ఈ ప్రకటన చేశాడు. తన బ్యాంకు ఖాతాలో కేవలం రూ.80,000 మాత్రమే ఉన్నాయని.. శిక్షణకు ఈ డబ్బు సరిపోదని నిరుడు సెప్టెంబరులో నగాల్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు