గుకేశ్‌ ఓటమి.. ప్రజ్ఞానందకు డ్రా

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌కు పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన ఏడో రౌండ్లో అలీ రెజా (2.5 పాయింట్లు- ఫ్రాన్స్‌) చేతిలో గుకేశ్‌ (4 పాయింట్లు) ఓటమి చవిచూశాడు.

Published : 13 Apr 2024 02:45 IST

టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌కు పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన ఏడో రౌండ్లో అలీ రెజా (2.5 పాయింట్లు- ఫ్రాన్స్‌) చేతిలో గుకేశ్‌ (4 పాయింట్లు) ఓటమి చవిచూశాడు. ఆరో రౌండ్లో గెలుపుతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన గుకేశ్‌.. తాజా పరాజయంతో వెనుకబడ్డాడు. హికరు నకముర (3.5- అమెరికా)తో డ్రా చేసుకున్న నెపోమ్నియాషి (4.5- రష్యా) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫాబియానో కరువానా (4- అమెరికా)తో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద (4), నజత్‌ అబసోవ్‌ (2- అజర్‌బైజాన్‌)తో విదిత్‌ గుజరాతీ (3.5) డ్రా చేసుకున్నారు. ఏడు రౌండ్ల అనంతరం గుకేశ్‌, ప్రజ్ఞానంద, కరువానా నాలుగేసి పాయింట్లతో ఉమ్మడిగా ద్వితీయ స్థానంలో ఉన్నారు. మహిళల విభాగంలో అనా ముజిచుక్‌ (2.5- ఉక్రెయిన్‌)తో కోనేరు హంపి (2.5) డ్రా చేసుకుంది. టింగ్‌జీ లీ (4- చైనా) చేతిలో వైశాలి (2.5) పరాజయం చవిచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు