చెఫ్‌ డి మిషన్‌గా తప్పుకున్న మేరీకోమ్‌

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత చెఫ్‌ డి మిషన్‌ బాధ్యతల నుంచి దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ శుక్రవారం తప్పుకొంది. వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు మేరీ కోమ్‌ లేఖ రాసినట్లు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పి.టి.ఉష వెల్లడించింది.

Published : 13 Apr 2024 02:46 IST

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత చెఫ్‌ డి మిషన్‌ బాధ్యతల నుంచి దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ శుక్రవారం తప్పుకొంది. వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు మేరీ కోమ్‌ లేఖ రాసినట్లు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పి.టి.ఉష వెల్లడించింది. ‘‘ఏ రూపంలోనైనా దేశానికి సేవ చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తా. అందుకు మానసికంగానూ సిద్ధమయ్యా. అయితే ప్రతిష్టాత్మక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నందుకు చింతిస్తున్నా. వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నా’’ అని ఉషకు రాసిన లేఖలో మేరీకోమ్‌ తెలిపింది. ‘‘ఒలింపిక్‌ పతక విజేత, ఐఓఏ అథ్లెట్స్‌ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ మేరీ కోమ్‌ వ్యక్తిగత కారణాలతో వైదొలగడం బాధించింది. ఆమె నిర్ణయాన్ని, గోప్యతను గౌరవిస్తాం’’ అని ఉష వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని