అది నా చేతుల్లో లేదు

టీ20 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికవడం తన చేతుల్లో లేదని.. ప్రతి మ్యాచ్‌లోనూ రాణించడానికి మాత్రమే ప్రయత్నిస్తానని ముంబయి ఇండియన్స్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ అన్నాడు. ‘‘జట్టులోకి ఎంపిక కావడం నా చేతుల్లో లేదు.

Updated : 13 Apr 2024 09:00 IST

ముంబయి: టీ20 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికవడం తన చేతుల్లో లేదని.. ప్రతి మ్యాచ్‌లోనూ రాణించడానికి మాత్రమే ప్రయత్నిస్తానని ముంబయి ఇండియన్స్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ అన్నాడు. ‘‘జట్టులోకి ఎంపిక కావడం నా చేతుల్లో లేదు. ప్రతి మ్యాచ్‌లోనూ రాణించే ప్రయత్నం చేస్తా. ఐపీఎల్‌ లాంటి పెద్ద టోర్నీలో సత్తా చాటాలి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని కిషన్‌ పేర్కొన్నాడు. తాను క్రికెట్‌ నుంచి విరామం తీసుకున్నప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని.. కానీ కొన్ని విషయాలు ఆటగాళ్ల పరిధిలో ఉండవని కిషన్‌ చెప్పాడు. ‘‘ఐపీఎల్‌ కోసం సాధన చేస్తున్నా. బరిలో దిగడానికి కాస్త సమయం తీసుకున్నా. ఈలోగా చాలామంది ఏవేవో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కానీ కొన్ని విషయాలు ఆటగాళ్ల పరిధిలో ఉండవనేది గ్రహించాలి’’ అని ఇషాన్‌ పేర్కొన్నాడు. హార్దిక్‌ పాండ్య సవాళ్లను ఆస్వాదిస్తాడని.. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా అతడిని అభిమానులు ఇప్పుడిప్పుడే ఇష్టపడడం మొదలుపెట్టారని అతనన్నాడు. మానసిక రుగ్మత కారణంగా చూపుతూ దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో తప్పుకున్న కిషన్‌.. ఫిట్‌నెస్‌ సాధించినా దేశవాళీల్లో బరిలో దిగలేదు. ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ చేశాడు. రంజీ ట్రోఫీ ఆడమని బీసీసీఐ ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పోగొట్టుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని