రోహిత్‌ వేలంలోకి రావాలే కానీ..

 వచ్చే ఏడాది ఐపీఎల్‌ మెగా వేలంలోకి రోహిత్‌శర్మ వస్తే ఎలాగైనా అతడిని దక్కించుకుంటామని పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని ప్రీతి జింతా తెలిపింది.

Published : 15 Apr 2024 07:00 IST

చండీగఢ్‌: వచ్చే ఏడాది ఐపీఎల్‌ మెగా వేలంలోకి రోహిత్‌శర్మ వస్తే ఎలాగైనా అతడిని దక్కించుకుంటామని పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని ప్రీతి జింతా తెలిపింది. ముంబయి ఇండియన్స్‌ను అయిదుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ అందించిన రోహిత్‌కు ఛాంపియన్‌ దృక్పథం ఉందని.. అతడు జట్టుకు స్థిరత్వాన్ని తెస్తాడని జింతా భావిస్తోంది. ఇప్పటిదాకా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవలేకపోయిన పంజాబ్‌.. ఈ సీజన్లోనూ రాణించలేకపోతోంది. 6 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలే సాధించింది. ఈ సీజన్లో ముంబయి యాజమాన్యం కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ పాండ్యకు పగ్గాలప్పగించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని