పోలీసుల రిమాండ్‌లో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత మైకెల్‌ స్లేటర్‌ను పోలీసులు రిమాండ్‌లోకి తీసుకున్నారు. దాడి చేయడం, వెంబడించడం అభియోగాలతో అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 16 Apr 2024 03:23 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత మైకెల్‌ స్లేటర్‌ను పోలీసులు రిమాండ్‌లోకి తీసుకున్నారు. దాడి చేయడం, వెంబడించడం అభియోగాలతో అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. గృహ హింస, వెంబడించడం, దాడి చేయడం, ఊపిరాడకుండా చేయడం, శరీరానికి హాని కలిగించడం, రాత్రి ఇంట్లో దూరడం ఇలా 54 ఏళ్ల స్లేటర్‌పై మొత్తం 19 అభియోగాలున్నాయి. మాజీ భార్యపై గృహ హింస, వెంబడించడం, హింసించడం తదితర ఆరోపణలతో 2021 అక్టోబర్‌లో అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కూడా వివిధ కేసుల్లో అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరిగి బెయిల్‌పై అతను బయటకొచ్చాడు. 2022లో పోలీసు అధికారిని వెంబడించి అతను మరోసారి అరెస్టయ్యాడు. నిరుడు నవంబర్‌లో పోలీసులతో వాగ్వాదం కారణంగా జరిమానా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు వివిధ ఆరోపణలతో పోలీసుల చేతికి చిక్కాడు. 1993 నుంచి 2003 మధ్యలో ఓపెనర్‌గా స్లేటర్‌ ఆసీస్‌ తరపున 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని