నకమురపై విదిత్‌ విజయం

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజరాతి సత్తా చాటాడు. తొమ్మిదో రౌండ్లో అతడు రెండో సీడ్‌ హికరు నకముర (అమెరికా)పై విజయం సాధించాడు.

Published : 16 Apr 2024 03:23 IST

టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజరాతి సత్తా చాటాడు. తొమ్మిదో రౌండ్లో అతడు రెండో సీడ్‌ హికరు నకముర (అమెరికా)పై విజయం సాధించాడు. టోర్నీలో విదిత్‌ ఇంతకుముందు కూడా నకమురపై నెగ్గాడు. గుకేశ్‌, ప్రజ్ఞానంద మధ్య గేమ్‌ డ్రాగా ముగిసింది. లీరెజా (ఫ్రాన్స్‌)తో గేమ్‌ను నెపోమ్నియాషి డ్రా చేసుకున్నాడు. టోర్నీలో మరో అయిదు రౌండ్లు మిగిలి ఉండగా.. గుకేశ్‌, నెపోమ్నియాషి (రష్యా) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 5 పాయింట్లతో ప్రజ్ఞానంద మూడో స్థానంలో ఉన్నాడు. విదిత్‌, నకముర, కరువానా (అమెరికా) 4.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో జ్యోంగి తాన్‌ (చైనా) చేతిలో వైశాలి (2.5) పరాజయంపాలైంది. లాగ్నో (రష్యా)తో గేమ్‌ను కోనేరు హంపి (4) డ్రాగా ముగించింది. ఆరు పాయింట్లతో తాన్‌ ఒంటరిగా అగ్రస్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని