మరో సింధుని అవుతా

పి.వి.సింధునే తనకు స్ఫూర్తి అని ఆమెలాగే తానూ ఛాంపియన్‌ ప్లేయర్‌గా ఎదగాలని కోరుకుంటున్నానని యువ షట్లర్‌ తన్విశర్మ చెప్పింది. 15 ఏళ్ల తన్వి.. ఈ నెల చైనాలో జరిగే ఉబర్‌కప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలు.

Published : 16 Apr 2024 03:24 IST

దిల్లీ: పి.వి.సింధునే తనకు స్ఫూర్తి అని ఆమెలాగే తానూ ఛాంపియన్‌ ప్లేయర్‌గా ఎదగాలని కోరుకుంటున్నానని యువ షట్లర్‌ తన్విశర్మ చెప్పింది. 15 ఏళ్ల తన్వి.. ఈ నెల చైనాలో జరిగే ఉబర్‌కప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలు. ‘‘సింధు అక్కలాగే కావాలని ఉంది. ఆమే నా స్ఫూర్తి. సింధు ఆడిన అన్ని మ్యాచ్‌లు వదలకుండా చూస్తా. ఆమె దూకుడు ఎంతో ఇష్టం. ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో పసిడి గెలవడం ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది’’ అని తన్వి తెలిపింది. ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ బరిలో దిగకపోయినా.. సీనియర్ల ఆటను గమనించి ఎంతో నేర్చుకున్నానని  తన్వి చెప్పింది. పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌కు చెందిన తన్వి పిన్న వయసులోనే  బ్యాడ్మింటన్‌లో అదరగొడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని