అలెక్‌నా ప్రపంచరికార్డు

డిస్కస్‌ త్రోలో లిత్వేనియా అథ్లెట్‌ మికోలాస్‌ అలెక్‌నా నయా రికార్డు సృష్టించాడు. ఒక్‌హోమా సిరీస్‌ టోర్నమెంట్లో డిస్క్‌ను 74.35 మీటర్ల దూరం విసిరిన అలెక్‌నా స్వర్ణం గెలుచుకున్నాడు.

Published : 16 Apr 2024 03:24 IST

రమోనా (అమెరికా): డిస్కస్‌ త్రోలో లిత్వేనియా అథ్లెట్‌ మికోలాస్‌ అలెక్‌నా నయా రికార్డు సృష్టించాడు. ఒక్‌హోమా సిరీస్‌ టోర్నమెంట్లో డిస్క్‌ను 74.35 మీటర్ల దూరం విసిరిన అలెక్‌నా స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలో జార్గెన్‌ స్కట్‌ (జర్మనీ, 74.08 మీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. జార్గెన్‌ 1986లో ఈ రికార్డు సృష్టించడం విశేషం. 21 ఏళ్ల అలెక్‌నా రెండుసార్లు ప్రపంచ ఔట్‌డోర్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. 2022 హంగేరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని