రోహిత్‌ ఓటమి

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రోహిత్‌ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓడాడు.

Published : 17 Apr 2024 02:53 IST

బిష్కెక్‌: ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రోహిత్‌ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓడాడు. మరోవైపు పర్వేశ్‌ (60 కేజీ), వినాయక్‌ పాటిల్‌ (67 కేజీ), అంకిత్‌ గులియా (72 కేజీ) ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగారు. పర్వేశ్‌.. గాల్‌యమ్‌ (కజకిస్థాన్‌) చేతిలో ఓడగా.. వినాయక్‌పై చాంగ్‌ (దక్షిణ కొరియా) పైచేయి సాధించాడు. సతాయెవ్‌ చేతిలో అంకిత్‌ పరాజయం చవిచూశాడు. ఇప్పటికే అర్జున్‌ (55 కేజీ), ఉమేశ్‌ (63 కేజీ), సాజన్‌ (77 కేజీ), అజయ్‌ (87 కేజీ) కూడా పోటీ నుంచి నిష్క్రమించారు.  ఈ టోర్నీలో భారత్‌ ఇప్పటిదాకా మూడు రజతాలు, అన్నే కాంస్యాలు గెలుచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని