అగ్రస్థానంలో గుకేశ్‌

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్‌ గేమ్‌ను అతడు డ్రాగా ముగించాడు.

Published : 17 Apr 2024 02:53 IST

టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్‌ గేమ్‌ను అతడు డ్రాగా ముగించాడు. మరో నాలుగు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్న టోర్నీలో గుకేశ్‌, నెపోమ్నియాషి 6 పాయింట్లతో సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతి మధ్య గేమ్‌ కూడా డ్రా అయింది. ప్రజ్ఞానంద, కరువానా, నకముర తలో 5.5 పాయింట్లతో రేసులో ఉన్నారు. మహిళల విభాగంలో సలిమోవ్‌ (బల్గేరియా)పై వైశాలి (3.5) విజయం సాధించింది. జ్యోంగి తాన్‌ (చైనా)తో గేమ్‌ను కోనేరు హంపి డ్రాగా ముగించింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని