నాదల్‌ విజయంతో..

స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్‌ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు.

Published : 17 Apr 2024 02:54 IST

బార్సిలోనా: స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్‌ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 12సార్లు టైటిల్‌ గెలిచిన రఫా.. తొలి మ్యాచ్‌లో పెద్దగా ఇబ్బంది పడకుండానే నెగ్గాడు. మార్చిలో కార్లోస్‌ అల్కరాస్‌తో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఆడిన తర్వాత బరిలో దిగడం 37 ఏళ్ల రఫాకు ఇదే తొలిసారి. తుంటి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత నాదల్‌ తొలి టోర్నీలో ఆడుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు