శ్రీజ, మనిక పరాజయం

ఐటీటీఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత టేబుట్‌ టెన్నిస్‌ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయారు.

Published : 18 Apr 2024 02:17 IST

మకావు: ఐటీటీఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత టేబుట్‌ టెన్నిస్‌ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయారు. ప్రతి గ్రూపులో ముగ్గురేసి క్రీడాకారిణులు ఉండగా.. అగ్రస్థానంలో నిలిచిన వారికి నాకౌట్‌ బెర్తు దక్కింది. తొలి రౌండ్లో 11-9, 11-6, 11-5, 11-5తో నటాలియా బేజోర్‌ (పోలెండ్‌)పై నెగ్గిన శ్రీజ.. రెండో రౌండ్లో 4-11, 4-11, 15-13, 2-11తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ చెన్‌ మెంగ్‌ (చైనా) చేతిలో ఓడింది. తొలి రౌండ్లో మనిక 9-11, 11-8, 11-6, 11-8తో ఎడినా డయాకో (రొమేనియా)పై గెలిచింది. రెండో రౌండ్లో 6-11, 4-11, 9-11, 4-11తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ మన్యు (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని