ఫైనల్లో దీప

భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌ వాల్ట్‌ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్‌ రౌండ్‌ తొలి వాల్ట్‌లో 12.5, రెండో వాల్ట్‌లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

Published : 18 Apr 2024 02:20 IST

జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌

దిల్లీ: భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌ వాల్ట్‌ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్‌ రౌండ్‌ తొలి వాల్ట్‌లో 12.5, రెండో వాల్ట్‌లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. టాప్‌-8 జిమ్నాస్ట్‌లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. మరో భారత జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌ 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూరమైంది. శుక్రవారం తుది పోరు జరుగుతుంది. రియో ఒలింపిక్స్‌ తర్వాత 2017, 2019లో మోకాలికి శస్త్రచికిత్సలు చేయించుకున్న దీప.. ఆ తర్వాత డోపింగ్‌ ఉల్లంఘన కారణంగా 21 నెలల నిషేధం ఎదుర్కొంది. ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినా ఆమె వాల్ట్‌ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కష్టమే. ఈ టోర్నీ నుంచి వాల్ట్‌లో ఇద్దరికి మాత్రమే ఒలింపిక్‌ బెర్తులు లభిస్తాయి. ర్యాంకింగ్స్‌లో దీప కంటే ముందు చాలామంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని