షారుక్‌ను కలిసిన వేళ

యశస్వి జైస్వాల్‌.. ఇప్పుడీ యువ ఓపెనర్‌ పేరు తెలియని క్రికెట్‌ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు.

Published : 18 Apr 2024 02:25 IST

కోల్‌కతా: యశస్వి జైస్వాల్‌.. ఇప్పుడీ యువ ఓపెనర్‌ పేరు తెలియని క్రికెట్‌ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. కానీ యశస్వి అభిమానిగా మారిపోయి షారుక్‌ ఖాన్‌ను కలవడం కోసం తపించాడు. మంగళవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైడ్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. కోల్‌కతా సహ యజమాని అయిన షారుక్‌ ఆ మ్యాచ్‌కు హాజరయ్యాడు. మ్యాచ్‌ ముగిశాక మైదానంలో ఆటగాళ్లను కలిశాడు. ఆ సమయంలోనే అవకాశం కోసం ఎదురు చూస్తున్న యశస్వి.. తనను షారుక్‌కు పరిచయం చేయాలంటూ పక్కన ఉన్నవాళ్లను అడిగాడు. ఆ తర్వాత షారుక్‌ వచ్చి యశస్విని కలిసి హత్తుకున్నాడు. నవ్వుతూ మాట్లాడాడు. ఆ క్షణంలో సంతోషంలో తేలిపోయిన యశస్వి.. షారుక్‌తో ఫొటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని